చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ముమ్మర గాలింపు.. ఆచూకీ తెలిసేదెలా?

AP: సంచలనంగా మారిన తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటితో నెల పూర్తికానుంది. గత నెల 6న ఆమె ఇంటి సమీపంలో తండ్రిని వెతుక్కుంటూ వెళ్లి అదృశ్యమైంది. చిన్నారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చిన్న ఆధారం దొరకలేదు. తండ్రికి బయట వ్యక్తులతో ఉన్న వ్యాపార, ఆర్థిక ఇతర వ్యక్తులను ఆరా తీశారు. చిన్నారి కాళ్ళకు ఉన్న వెండి పట్టీలు, మెడలో వెండి బిళ్ల ఎక్కడైనా లభ్యమవుతుందా? అని పోలీసులు అన్వేషిస్తున్నారు. బిడ్డపై బెంగతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కూతురి కోసం పోస్టర్లు అంటిస్తూ తండ్రి గాలిస్తూనే ఉన్నారు.

సంబంధిత పోస్ట్