కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా నటిస్తూ, ఎన్నికల టికెట్లు, పార్టీ పదవులు ఇప్పిస్తానని ఆశావహుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన డిజిటల్ మోసగాడిని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నాయకురాలు భావనా పాండే ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు గౌరవ్ కుమార్, తనను కనిష్క్ సింగ్‌గా పరిచయం చేసుకుని, డబ్బులు ఇస్తే పదవులు, టికెట్లు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో ఈ మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.