ముంబైలోని వినోబా భావే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఐదుగురు స్నేహితులు బర్త్‌డే పార్టీ పేరుతో అబ్దుల్ రెహమాన్ అనే యువకుడిని ఇంటి బయటకు పిలిచి, సజీవ దహనం చేశారు. కేక్ తీసుకువచ్చిన స్నేహితులు, అబ్దుల్ రెహమాన్ బయటకు రాగానే 'హ్యాపీ బర్త్‌డే' అని చెప్పి, వెంటనే అతనిపై గుడ్లు, రాళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత బాటిల్‌లో తెచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాధితుడు తేరుకునే లోపే సజీవంగా కాలిపోయాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.