AP: కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలంలో ఓ పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పల్లం గ్రామంలో శనివారం మల్లాడి భాగ్యరాజ్ అనే వ్యక్తి బైక్పై అన్న కుమారుడి వివాహం సందర్భంగా పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్తున్నాడు. అయితే ఈ క్రమంలో కొబ్బరికాయల లోడుతో వస్తున్న ట్రాక్టర్ వెనుకనుంచి అతన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో భాగ్యరాజ్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.