జాతీయ రహదారిపై ఏనుగుల గుంపు కలకలం రేపింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజాజీ జాతీయ ఉద్యానవనం అటవీ ప్రాంతం నుంచి ఆరు ఏనుగులు బయటకు వచ్చాయి. హరిద్వార్-లక్సర్ రహదారిపైకి అవి రావడంతో అక్కడ గందరగోళం తలెత్తింది. ఈ కరణంలో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ఏనుగుల గుంపు రోడ్డును దాటిన తర్వాత వాహనాలు కదిలాయి. ఇందుకు సంబందించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.