ఆర్మీ క్యాంప్‌లోకి ఐదు ఏనుగుల గుంపు (వీడియో)

పశ్చిమ బెంగాల్ బాగ్డోగ్రా పరిధిలో అర్ధరాత్రి వేళ ఐదు అడవి ఏనుగుల గుంపు తీవ్ర కలకలం సృష్టించింది. మహానంద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఏనుగులు బాలాసన్ నదిని దాటి ఆహార అన్వేషణలో బాగ్డోగ్రాలోని బెంగ్డూబి ఆర్మీ క్యాంప్‌లోకి ప్రవేశించాయి. సైనిక స్థావరంలో ఏనుగులు సంచరించడంతో సైనికులు, అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగులను సురక్షితంగా మళ్లీ అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕