బాలుడి ప్రాణం తీసిన చీరతో కట్టిన ఊయల

AP: ఇంట్లో చీరతో కట్టిన ఊయల ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఆదోని పట్టణానికి చెందిన సునిల్ కుమార్, లక్ష్మి దంపతులకు అకీరానందన్ (10), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గురువారం ఇంట్లో ఉన్న అకీరానందన్ చీరతో కట్టిన ఊయలతో ఆడుకుంటూ టీవీ చూస్తున్నాడు. ఈ క్రమంలో చీర మెడకు చుట్టుకుని అకీరా మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.

సంబంధిత పోస్ట్