TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ‘నాన్నకు ఓ హగ్ ఇవ్వండి’ అంటూ యువతకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని, వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. స్ట్రీట్ కాజ్ అనే ఎన్జీవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులను ఆప్యాయంగా హత్తుకుంటే వారి కళ్లలో కనిపించే ఆనందం ఎంతో ప్రత్యేకమని అన్నారు. జీవితంలో పరుగులు ఎక్కువైనా, కుటుంబంతో గడిపే క్షణాలే నిజమైన జ్ఞాపకాలని పేర్కొన్నారు. తాను కూడా 40 ఏళ్ల వయసు వరకు తండ్రిని హత్తుకోలేదని, 2015 జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజయానంతరం మొదటిసారి హగ్ ఇచ్చానని కేటీఆర్ తెలిపారు.