మేధా పాట్కర్‌‌కు భారీ ఊరట.. జైలు శిక్ష సస్పెండ్

నర్మదా బచావో ఉద్యమ నేత మేధా పాట్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పరువు నష్టం దావా కేసులో 5 నెలల జైలు శిక్షను న్యాయస్థానం సోమవారం సస్పెండ్ చేసింది. 25,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. 23 ఏళ్ల క్రితం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గుజరాత్‌లోని ఎన్జీవోకు నేతృత్వం వహించిన పరువు నష్టం కేసులో మేధా పాట్కర్‌కు జూలైలో శిక్ష పడింది. దీంతో ఆమె శిక్ష రద్దు చేయాలని ధర్మాసనాన్ని ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్