విశ్వవిజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. క్రికెట్ జట్టుకు రూ.51 కోట్లు ప్రకటించినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. కాగా, వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి రూ.39 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. 47 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్ సేన ఛాంపియన్‌గా అవతరించింది.