TG: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా-K గ్రామం వార్తల్లో నిలిచింది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'మియాజాకి' మామిడి పండ్లు దర్శనమిస్తున్నాయి. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి నాలుగేళ్ల క్రితం నాటిన 500 మామిడి మొక్కలలో ఐదు మియాజాకి రకానికి చెందినవి ఉన్నాయి. ప్రత్యేక శ్రద్ధతో పెంచిన ఈ మొక్కలు తొలి కాతకు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మామిడి పండ్ల ధర కిలో రూ.2.5 లక్షల నుండి రూ.2.8 లక్షల వరకు పలుకుతుందని గాడ్గే మీనాక్షి తెలిపారు. తెలంగాణ పల్లెటూర్లో ఇంతటి అరుదైన పంట పండటం విశేషం.