కల్లు సీసాలో బల్లి.. వ్య‌క్తికి అస్వ‌స్థ‌త‌

TG: నిజామాబాద్ జిల్లాలోని రెంజల్‌ మండలంలో షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ ఒక కల్లు దుకాణంలోని కల్లు సీసాలో ఓ బల్లి ప్ర‌త్య‌క్షమైంది. అయితే ఓ వ్యక్తి సీసాలోని బల్లిని గమనించకుండా క‌ల్లు తాగాడు. దీంతో కొద్ది సేపటి త‌ర్వాత వాంతులు కావడంతో.. స్థానికులు అతన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీంతో కల్లు దుకాణంలో బాధితుడి స్నేహితులు వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్