బీహార్ రాజధాని పాట్నాలో విషాదం చోటుచేసుకుంది. భార్య మీద కోపంతో ఓ వ్యక్తి కొడుకుని కొట్టి చంపాడు. తన ఆరేళ్ల కొడుకుని తీవ్రంగా కొట్టి నేలపై విసిరాడు. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తండ్రి పోలీసుల అదుపులో ఉన్నాడు.