యూఏఈలోని షార్జాలో కర్ణాటకకు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్ (18 ఏళ్లుగా షార్జా విమానాశ్రయంలో పనిచేస్తున్నారు) దారుణ హత్యకు గురయ్యారు. జులైలో హత్య జరిగినట్లు అనుమానిస్తుండగా.. రెండు నెలల తర్వాత ఒమన్ వెళ్లే మార్గంలో ఓ కారులో ఆయన మృతదేహాన్ని 9 ముక్కలుగా నరికి రెండు బ్యాగుల్లో ఉంచినట్లు గుర్తించారు. అల్విన్ భార్య, కుమారుడు కూడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై షార్జా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.