కొత్త సంవత్సరం ప్రారంభమైన వేళ జపాన్ దేశాన్ని భారీ భూకంపం వణికించింది. జపాన్ తూర్పు నోడా ప్రాంత తీరంలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం నోడా నగరానికి తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 19.3 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.