కంటి చూపును తిరిగి రప్పించే ఔషధం!

కంటి చూపును తిరిగి రప్పించే ఔషధం త్వరలోనే తయారుకానుంది. కంటి నరాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ కవచం దెబ్బతిన్నప్పుడు కంటిచూపు కోల్పోతాము. అలా కోల్పోయే వారి చూపును.. తిరిగి పొందేందుకు అమెరికాలోని కొలరాడో పరిశోధకులు ఔషధాన్ని అభివృద్ధి చేశారు. LL341070గా పిలుస్తున్న ఈ ఔషధం మైలిన్ మరమ్మతు విషయంలో శరీరానికి సాయంగా నిలుస్తుందని తెలిపారు. ప్రస్తుతం పరిశోధన స్థాయిలో ఉన్నామని.. త్వరలోనే పూర్తిస్థాయి ఔషధాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్