చైనాలోని ఐలావో పర్వతం వద్ద ప్రతిరోజూ ఉదయాన్నే ప్రకృతి అద్భుతం కనిపిస్తోంది. సూర్యకాంతి సరైన కోణంలో పడటం, మేఘాల కదలికల వలన పర్వతం మండుతున్నట్లుగా కనిపించే దృశ్యం ఏర్పడుతోంది. ఈ సహజ కాంతి భ్రమను “అల్పెంగ్లో” (Alpenglow)గా పిలుస్తారు. ఇది సాధారణంగా సూర్యోదయానికి కొద్దిసేపు ముందు లేదా సూర్యాస్తమయం అనంతరం కనిపించే ప్రకృతి విశేషంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి అల్పెంగ్లో దృశ్యాలు భారత్‌లోనూ కంచనజంగా, నీలకంఠ్, చౌఖంబా వంటి హిమాలయ పర్వత శ్రేణులపై దర్శనమిస్తుంటాయి.