షాపులోనే ఫుల్లుగా మందు తాగిన కోతి

"అసలే కోతి.. ఆపై కల్లు తాగింది" అనే సామెతను నిజం చేస్తూ, తాజాగా ఓ కోతి మద్యం షాపులోకి వెళ్లింది. అక్కడ ఉన్న మద్యం బాటిల్ మూత తీసి గడగడా మందు తాగేసింది. దీంతో అవాక్కవడం సిబ్బంది వత్తైంది. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగింది. అయితే ‘కల్లు తాగిన కోతి’లా ప్రవర్తించకుండా మత్తు ఎక్కువై అక్కడే ఉన్న బాక్సులపై నిద్రపోయింది. ఈ మేరకు షాపులోకి వచ్చినవారు కోతిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕