జుట్టును శుభ్రం చేసుకునే పద్ధతిలో మార్పులు వస్తున్నాయి. చాలామంది షాంపూ తర్వాత కండిషనర్ వాడతారు. కానీ ఇప్పుడు 'శాండ్‌విచ్ మెథడ్' అనే కొత్త పద్ధతిపై ఆసక్తి పెరుగుతోంది. ఈ పద్ధతిలో ముందుగా కండిషనర్ రాసి, ఆ తర్వాత షాంపూతో స్కాల్ప్‌ను శుభ్రం చేసుకుని, చివరగా మళ్లీ కండిషనర్ రాయాలి. ఈ విధానం వల్ల జుట్టు పొడిబారకుండా, మృదువుగా, ఒత్తుగా మారుతుందని IJPRA అధ్యయనం పేర్కొంది. అయితే, ఈ పద్ధతి అందరికీ సరిపోకపోవచ్చు. స్కాల్ప్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.