అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలివెళ్లారు!

TG: అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలివెళ్లిన ఘటన ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం విఆర్ బంజర గ్రామంలో చోటుచేసుకుంది. ఓ క్లాత్‌లో చుట్టి ఉన్న పసికందును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆశా వర్కర్ సహాయంతో చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕