విమానంలో ప్రయాణికురాలికి అస్వస్థత.. సీపీఆర్‌ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే

గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ అనే ప్రయాణికురాలు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న కాన్పూర్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ అంజలి నింబాల్కర్‌ వెంటనే స్పందించి.. జెన్నీకి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. విమానం ఢిల్లీలో ల్యాండ్‌ అయిన తర్వాత జెన్నీని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డాక్టర్‌ అంజలి నింబాల్కర్‌ను ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్