జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులకు సహాయం చేసినందుకు హకమ్ (45) అనే కార్మికుడిని రాజౌరిలో అరెస్ట్ చేశారు. ఇతను ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం అందించడంతో పాటు దాడి చేయడానికి గైడ్‌గా వ్యవహరించాడు. ఈ దాడిలో తొమ్మిది మంది మరణించగా, 41 మంది గాయపడ్డారు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.