వియత్నాంలోని సహా ట్రాంగ్ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న 'ఎయిర్ ఏషియా' విమానంలో ఒక యువకుడు అర్ధనగ్నంగా సీట్లపైకి దూకుతూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాడు. అతని వింత ప్రవర్తనతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ల్యాండ్ అయిన వెంటనే యువకుడు పారిపోగా, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.