ఛత్తీస్గఢ్లో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో విమానం టైరు పేలింది. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో విమానంలో ఉన్న 37 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. బిలాస్పూర్ ఎయిర్పోర్ట్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.