నెలలు నిండిన ఓ గర్భిణి మరికొద్ది రోజుల్లో కవలలకు జన్మనిస్తానని ఆనందపడింది. అమ్మనయ్యే మధురానుభూతి పొందేందుకు ఆరాటపడింది. కానీ అంతలోనే డెంగ్యూ ఆ తల్లీబిడ్డలను బలి తీసుకుంది. హనుమకొండ గట్లకానిపర్తికి చెందిన శిరీష డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించింది. ఆమె కడుపులో ఉన్న కవలలను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం వృథా అయింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.