మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో దహిఫలే కుటుంబంలో సుమారు 200 ఏళ్ల తర్వాత ఆడపిల్ల జన్మించింది. నాలుగు తరాలుగా ఆడపిల్ల లేని లోటు తీరడంతో కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. పాపాయికి 'గర్గి' అని పేరు పెట్టి, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ రథంపై ఊరేగింపుగా ఇంటికి తీసుకువచ్చారు. పాపను లక్ష్మీదేవిగా భావిస్తున్నామని, కంటికి రెప్పలా చూసుకుంటామని తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య సంతోషం వ్యక్తం చేశారు.