మలయాళ నటి హనీ రోజ్‌ను బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని పేర్కొంటూ కేరళంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆమెపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆమె తనపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా ఓ కార్యక్రమంలో బాబీ తన లుక్స్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, SMలో డబుల్ మీనింగ్ పోస్టులతో వేధించారని హనీ రోజ్ ఆరోపించగా కేసు నమోదైంది.