టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ముంబైలోని వాంఖడేలో రోహిత్ శర్మ పేరు మీద స్టాండ్‌ను ప్రారంభించారు. స్టాండ్ ఓపెనింగ్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో రోహిత్ శర్మ భార్య రితికా స్టేజీపై ఎమోషనల్ అయ్యారు. స్టాండ్ ఓపెన్ చేయగానే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. వెంటనే ఆమె తన అత్తామామల వెనుకకు వెళ్లి కన్నీళ్లు తుడుచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.