AP: బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వ ‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP)’ కార్యక్రమం కింద విజయనగరం జిల్లా బొబ్బిలి వీణను ఎంపిక చేశారు. ODOP అవార్డును జిల్లా కలెక్టర్ ఢిల్లీలో మంగళవారం అందుకోనున్నారు. బిల్ క్లింటన్ ఈ వీణను స్వయంగా చూసి అభినందించారు. గ్లోబల్ సమ్మిట్, జీ-20 సమావేశాల్లో వీణ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీణ చిత్రంతో పోస్టల్ స్టాంపులు, స్మారక నాణేలు కూడా విడుదల చేశారు.