ప్రపంచంలోనే అత్యంత అరుదైన కీటకం ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది. ఈ కీటకానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కీటకం ధర రూ.75 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఉంటుందని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో ఒకటిగా గుర్తింపు ఉన్న ఈ కీటకాన్ని స్టాగ్ బీటిల్ అంటారు. ప్రత్యేకమైన ఆకారం ఉన్న ఈ కీటకాన్ని ఔషధ తయారీదారులు ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి సాధారణంగా అడవుల్లో నేలపై కనిపిస్తుంటాయి.