ఆఫ్రికా దేశంలో మిర్యాలగూడ వాసి కిడ్నాప్

పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఈ నెల 1న కేయస్ రీజియన్ లోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భారతీయులను ఉగ్రవాదులు బలవంతంగా తీసుకెళ్లారు. కిడ్నాప్ కు గురైన వారిని తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన అమరలింగేశ్వర రావు(45) తో పాటు జైపూర్‌కు చెందిన ప్రకాశ్ చంద్ జోషి, ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన పి.వెంకటరామన్ గా అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్