KVP స్కీమ్.. రూ. లక్ష పెట్టుబడి పెడితే రూ. 2 లక్షలు

పోస్టాఫీస్‌ అందించే కిసాన్‌ వికాస్‌ పత్ర (KVP) పథకంలో ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. ఈ రేటు ప్రకారం పెట్టుబడి 115 నెలల్లో (9 ఏళ్ల 7 నెలలు) రెట్టింపు అవుతుంది. కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఉదాహరణకు రూ.1 లక్ష పెట్టుబడి 115 నెలల్లో రూ.2 లక్షలు.. రూ.5 లక్షలు జమ చేస్తే రూ.10 లక్షలు అవుతాయి. ఖాతా తెరిచే సమయంలో ఉన్న వడ్డీ రేటే మెచ్యూరిటీ వరకు వర్తిస్తుంది. భారతీయ నివాసితులు వ్యక్తిగతంగా లేదా గరిష్ఠంగా ముగ్గురు కలిసి ఖాతా తెరవొచ్చు. మైనర్ల పేరిట సంరక్షకులు ఖాతా తెరవవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕