కొన్ని రోజుల క్రితం భారీగా పెరిగిన టామాటా ధరలు ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో హమ్మయ్య టామాటా దిగొస్తోందని సామాన్యులు సంతోషించే లోపే మరోసారి షాక్ ఇచ్చింది. బహిరంగ మార్కెట్‌లో కిలో ధర పలు చోట్ల రూ.100కు చేరింది. సెప్టెంబర్ వరకు దిగుబడి వచ్చే ఛాన్స్ లేకపోవడంతో ధరలు ఇలాగే ఉండే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ఇలాగైతే దీనిని ప్రస్తుతానికి వంటగది నుంచి తప్పించడం మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.