కాటేసిన నాగు.. మూడు పాములతో ఆసుపత్రికి వెళ్లి!

బిహార్‌లోని సాసారామ్‌లోని ఓ ఆసుపత్రిలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పాము కరిచిన గౌతమ్‌ కుమార్‌ అనే వ్యక్తి చికిత్స కోసం వెళ్లగా, అతడి చేతిలో మూడు నాగుపాములు ఉండటంతో వైద్యులు, సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. గౌతమ్‌కు పాములను పట్టడంలో నైపుణ్యం ఉందని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల మూడు పాములను రెస్క్యూ చేసిన క్రమంలో ఒక నాగు అతడిని కాటేసింది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పాములను అటవీశాఖ సాయంతో అడవిలో విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్