వేగంగా వచ్చి మహిళలను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి!

మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా జలంబ్‌ రైల్వే స్టేషన్ సమీపంలో భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఒక కారు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు మహిళలను బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕