ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో ఒక కొడుకు తన తల్లిపై కర్కశంగా దాడి చేశాడు. నిషాంత్ ఠాగూర్(44) అనే కొడుకు తన తల్లి జుట్టు పట్టుకుని, కాలితో తన్ని, పిడిగుద్దులతో కొట్టాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయింది. కూతురి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మానవత్వానికే మచ్చ తెచ్చిందని పలువురు అభివర్ణిస్తున్నారు.