'మారెమ్మ' టీజర్ విడుదల.. సామాన్య యువకుడి పోరాటమే ప్రధానాంశంగా

రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'మారెమ్మ'. గ్రామీణ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఊరిని చుట్టుముట్టిన వింత వ్యాధిని, గ్రామ దేవత మారెమ్మ తల్లిని, పవిత్ర దున్నపోతును కాపాడే బాధ్యత హీరోపై ఉంటుంది. తన ఊరిని, నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఒక సామాన్య యువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా ప్రధానాంశం. దీపా బాలు హీరోయిన్‌గా, వినోద్ కుమార్ విలేజ్ హెడ్‌గా నటిస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం, మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్