భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యంత గౌరవం ఉంది. 'గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః' అనే శ్లోకం గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానంగా, సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపంగా అభివర్ణిస్తుంది. గురువు విద్యార్థి జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా.. జీవన నైపుణ్యాలు, నీతి, క్రమశిక్షణ వంటి విలువలను కూడా నేర్పిస్తాడు.