తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎదురవుతున్న రాజకీయ పరిణామాలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. చెన్నైలోని విజయ్ నివాసం బయట ఓ అభిమాని కన్నీళ్లతో ప్రత్యేక పూజలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. మీడియా కథనాలపై స్పందించిన ఆ అభిమాని, “ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా వింతగా ఉంది.. ఒక్క పోలీసు కూడా కనిపించడం లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయ్ తప్పకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు” అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.