పదేళ్ల బాలికకు పెళ్లి.. వరుడెవరో తెలుసా?

అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పదేళ్ల బాలికతో స్వామివారి కళ్యాణోత్సవం వందేళ్లుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది కర్ణాటకకు చెందిన శ్రీ స్వర జాహ్నవి అనే బాలికతో స్వామివారి వివాహం జరిగింది. పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో స్వామివారికి వివాహం చేస్తే, ఆ బాలిక భవిష్యత్తులో ఉత్తమ భర్తను పొందుతుందని భక్తుల విశ్వాసం.

సంబంధిత పోస్ట్