అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి

అమెరికాలోని టెక్సస్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఇందులో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. మరో వ్యక్తి చెన్నైవాసి అని తెలిసింది. రోడ్డుపై వెళ్తున్న 5 వాహనాలు ఒకేసారి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మృతుల పేర్లు రఘునాథ్, లోకేష్, ఫరూక్ షేక్, కాగా చెన్నై వాసి పేరు దర్శిని వాసుదేవన్‌గా నిర్ధారించారు. మృతుల్లో ఒకరు కూకట్‌పల్లి వాసి అని సమాచారం.

సంబంధిత పోస్ట్