తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి మొసలికి ఆహారమయ్యాడు

గుజరాత్‌లోని వడోదరలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తిని మొసలి తినేసింది. వివరాల్లోకి వెళ్తే.. దేదియపడా తాలూకాలోని మథాసర్ గ్రామానికి చెందిన పరాసింగ్ భాయ్ వాసవ (50) చందోడ్ సమీపంలోని ఓర్సాంగ్ నదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు.ఈ క్రమంలో అతను నది ఒడ్డున కూర్చోగా సడెన్ గా ప్రత్యక్షమైన మొసలి అతడిని నీటిలోకి లాక్కెళ్లింది. అతను కేకలు వేయగా స్థానికులు వెళ్లి రక్షించేలోపు మొసలి అతడిని తినేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్