వివాహేతర సంబంధాల వల్ల దారుణాలు జరుగుతున్నాయి. యూపీ ప్రతాప్‌గడ్‌కి చెందిన వినోద్, పుష్ప భార్యాభర్తలు. వీరు హర్యానాలోని గురుగ్రామ్ కంపెనీలో పని చేస్తున్నారు. అక్కడ బీహార్ వాసి శివనాథ్ (45)తో పుష్ప ఎఫైర్ పెట్టుకుంది. శివను వదిలించుకోవాలని పుష్ప భావించింది. భర్త వినోద్‌తో కలిసి పుష్ప ప్లాన్ చేసింది. ప్రియుడిని ఇటీవల ఇంటికి పిలిపించి భర్తతో కలిసి హత్య చేసింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.