TG: సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ శుక్రవారం చేనేత మగ్గంపై 45 రోజుల శ్రమతో వాసవీమాత చరిత్రతో కూడిన పట్టుచీరను రూపొందించారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రత్నకుమారి–కోటేశ్వరరావు ఆర్డర్ మేరకు ఈ ఏడు మీటర్ల చీరలో 102 మంది రుషుల పేర్లు, 102 గోత్రనామాలు, వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి చరిత్రను తెలిపే 25 చారిత్రక చిత్రాలను పట్టుపోగులతో నేశారు. గతంలో హరిప్రసాద్ 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి గుర్తింపు పొందారు.