బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ‘ఝుండ్' సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన యువ నటుడు ప్రియాంషు ఠాకూర్ ను తన స్నేహితుడు ధ్రువ్ లాల్ బహదూర్ సాహు హత్య చేశాడు. ప్రియాంషు మెడను వైర్ తో గట్టిగా బిగించి కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడి బట్టలు లేకుండా క్రిటికల్ స్థితిలో ఉన్న ప్రియాన్షను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.