TG: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సంతోష్ నగర్‌లో మంగళవారం రాత్రి దేవరాజ్ అనే వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. అయితే ఒంటరిగా ఉంటున్న దేవరాజ్‌ను అదే కాలనీకి చెందిన దేవా అనే యువకుడు హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడు దేవాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.