ఉద్యోగం రావట్లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన భరత్‌ (28) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బీటెక్‌ పూర్తి చేసిన భరత్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం కొన్నేళ్లు ప్రయత్నించినా రాలేదు. దీంతో మానసికంగా కుంగిపోయిన అతను శనివారం రాత్రి ఇంట్లో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్