ఉద్యోగం నుంచి తొలగించారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పనిచేస్తున్న ఆసుపత్రిలోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. లక్నోలోని బలరామ్‌పూర్ ఆసుపత్రిలో అఖండ్ (30) అనే వ్యక్తి లిఫ్ట్ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆసుపత్రి అధికారులు అతన్ని ఉద్యోగం నుండి తొలగించారు. మనస్తాపానికి గురైన అఖండ్ శనివారం ఆసుపత్రిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.