TG: నారాయణపేట జిల్లా ధన్వాడలో విషాదం చోటుచేసుకుంది. రేపు(బుధవారం) పెళ్లి జరగాల్సి ఉండగా ఇవాళ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజోలి మల్లేశ్ అనే యువకుడు తెల్లవారుజామున చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాక ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.