ఒంటికి టపాసులు చుట్టుకుని.. యువకుడు హంగామా(వీడియో)

దీపావళి సందర్భంగా చాలా మంది టపాసులు కాల్చడానికి ఇష్టపడతారు. అయితే ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఓ వ్యక్తి తన ఒంటికి టపాసులు చుట్టుకుని నిప్పంటించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. ఆ టపాసులు పేలుతుంటే నొప్పితో అతడు విలవిలలాడటం ఆ వీడియోలో కనిపించింది. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో క్లారిటీ రాలేదు. అయితే అతడు కావాలనే ఇలా చేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్